సారథి న్యూస్, రామడుగు: రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామపంచాయతీ సర్పంచ్ సత్యప్రసన్నకు విజ్డమ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో లీడర్షిప్ అవార్డును రాష్ట్రపతి అవార్డు గ్రహీత కొండా రవి అందజేశారు. ఈ అవార్డు రాకతో తనపై మరింత బాధ్యత పెరిగిందని సత్యప్రసన్న అన్నారు. తన సేవాభావాన్ని గుర్తించిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.