న్యూఢిల్లీ: మూడేళ్లుగా రెజ్లింగ్‌లో నిలకడగా రాణిస్తున్న భారత రెజ్లర్ వినేశ్ పోగట్.. వరుసగా రెండో ఏడాది ప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయ్యింది. ఆమె పేరును సిఫారసు చేస్తున్నామని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) తెలిపింది. ఈ అవార్డు కోసం గతేడాది కూడా వినేశ్ పోటీపడినా.. బజ్రంగ్ పూనియాకు వరించింది. దీంతో ఈసారైనా తనకు అతిపెద్ద క్రీడాపురస్కారం దక్కుతుందని వినేశ్ ఆశాభావం వ్యక్తం చేసింది. జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గిన […]