లండన్: వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ అందుబాటులో ఉండడంపై సందిగ్దం నెలకొంది. జులై 8 నుంచి 12వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అదే సమయంలో రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో డెలివరీ సమయంలో భార్య వద్ద ఉండాలనే అభిప్రాయంతో రూట్ ఉన్నాడు. దీనికోసం అతను సెలవు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇది పూర్తయిన తర్వాత రూట్ టీమ్‌తో చేరాలంటే క్వారంటైన్ నిబంధనలు […]
కింగ్‌స్టన్: కరోనా కారణంగా ఆగిపోయిన ఇంటర్నేషనల్ క్రికెట్ వచ్చేనెల ఇంగ్లండ్–వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌తో తిరిగి మొదలవనుంది. ఇంగ్లండ్ వేదికగా పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ గురించి క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇంగ్లిష్ టీమ్ ఇప్పటికే ఔట్ డోర్ ట్రైనింగ్ స్టార్ట్ చేయగా.. విండీస్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే, ముగ్గురు స్టార్ ప్లేయర్లు డారెన్ బ్రావో, షిమ్రన్ హెట్‌మయర్, కీమో పాల్ ఇంగ్లండ్ వెళ్లేందుకు నిరాకరించడం చర్చనీయాశమైంది. ఈ […]
కింగ్‌స్టన్: ప్రపంచంలో కొనసాగుతున్న జాతి వివక్షపై అందరూ గళం విప్పాలని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. జాత్యహంకర ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. క్రికెట్ లోకం దీనిపై మాట్లాడాలని కోరాడు. ‘ఐసీసీతో పాటు అన్ని సభ్యదేశాలు దీనిపై మాట్లాడాలి. ఈ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ వివక్షలో వీళ్లు కూడా భాగస్వాములేనని అనుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి. దీనిని తరిమి కొట్టేదాకా […]