ప్రముఖ టాలీవుడ్ హీరో నితిన్ సోమవారం తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి.. తమ పెళ్లికి రమ్మని ఆహ్వానించారు. నితిన్, షాలిని వివాహం 16న జరగాల్సి ఉండగా లాక్‌డౌన్‌తో వాయిదాపడింది. దీంతో జూలై 26న రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ముహూర్తం పెట్టించారు. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలస్‌లో పెళ్లి జరుగనున్నట్టు సమాచారం.