సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్జిల్లా చొప్పదండి పట్టణంలోని 8వ వార్డ్ కౌన్సిలర్రాజన్నల ప్రణీత ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్డు సమస్యలు, అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. పట్టణ అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ రవి, వార్డు స్పెషలాఫీసర్ పవన్ పి.మహేష్, బిల్ కలెక్టర్లు ప్రభాకర్, ఆర్పీ సౌందర్య, ఆశా కార్యకర్త […]