సారథి న్యూస్, వరంగల్: కరోనా బారినపడి మరణించిన వారి దహనానికి ప్రత్యంగా శ్మశానవాటికల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం వారితో సమీక్షించారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల కోసం వేర్వేరుగా ప్రత్యేక స్థలాలను గుర్తించాలన్నారు. మృతదేహాలను శ్మశానవాటికలకు తరలించడానికి అంబులెన్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఎఫ్ వో కిశోర్ ఆధ్వర్యంలో 12 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు వివరించారు. హోం క్వారంటైన్‌కు మున్సిపల్ గెస్ట్‌హౌస్, […]