సారథి, కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎల్లేని సుధాకర్ రావు గురువారం అందజేశారు. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుమారు 200 మంది విద్యావలంటీర్లకు నిత్యావసర సరుకులు అందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లను ప్రభుత్వం విస్మరించిందని, పాఠశాలలు తెరుచుకోకపోవడంతో 14 నెలలుగా […]