సామాజిక సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాతగిరి శంకర దాసమయస్వామి ఆలయానికి మాజీ వార్డు సభ్యురాలు సాయిని విజయ దేవయ్య 1600 గ్రాములతో తయారుచేసిన నాగదేవత వెండి ప్రతిమను బహూకరించారు. అర్చకులు ప్రామక మనోహర్, చొప్పకట్ల కార్తీక్ ఆధ్వర్యంలో అభిషేకం జరిపించారు. కార్యక్రమంలో చందు, దుర్గేశం తదితరులు పాల్గొన్నారు.