ఒక వ్యక్తి నిర్మాణానికి తొలి పాఠశాలగా తాను పుట్టిపెరిగిన గృహమే ఆధారంగా నిలుస్తుందని సామాజిక శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. ఈ స్థితిలో చిన్నారులను మనం తీర్చిదిద్ద గలిగినప్పుడు వారి వ్యక్తిత్వ నిర్మాణం, మనోవికాసం ఎదిగాక సమాజంలో సాగించే మనుగడకు ఆలంబనగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. ఇందుకు తొలి పాఠశాల అయిన ఇంటిని.. బిడ్డలను తీర్చిదిద్దే మహా ఆలయంగా ఎలా మలచాలన్నదే నేడు మన ముందున్న ప్రశ్న. దీన్ని చక్కదిద్దుకోకుండా మనమేమీ సాధించలేం. మనకో సామెత ఉంది ‘మొక్కై వంగనిదే […]