సారథి న్యూస్, వెల్దండ: వెల్దండ మేజర్ పంచాయతీని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శ్రీధర్ ప్రజాప్రతినిధులు, అధికారులను కోరారు. గురువారం ఆయన వెల్దండ మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. పక్కాగా పల్లె ప్రగతి పనులు చేపట్టాలని ఆదేశించారు. వానాకాలంలో నాటేందుకు హరితహారం మొక్కలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించి బాగా జరుగుతున్నాయని కితాబిచ్చారు. కలెక్టర్ వెంట స్థానిక సర్పంచ్ యెన్నం భూపతిరెడ్డి, డీపీవో సురేష్ […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్ను కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ గురువారం సందర్శించి ఆస్పత్రి భవన స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని తెలియడంతో స్థానిక తహసీల్దార్ సైదులుతో కలిసి ఆయన పరిశీలించారు. ఒకవేళ ఆస్పత్రిని మార్చితే స్థానిక అనుకూలమైన భవనాలను కలియ తిరిగి చూశారు.
సారథి న్యూస్, వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెండు వరి కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ జి.సైదులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. నాణ్యమైన పంటను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. అకాలవర్షాలు కురుస్తున్న వేళ ధాన్యం నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టార్ఫలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వరి ధాన్యంలో తేమశాతం 14 […]