సారథిన్యూస్, హైదరాబాద్: విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో […]