సారథి, వేములవాడ: ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం వేములవాడ నియోజకవర్గం రుద్రంగి మండల కేంద్రంలో కార్మికులతో పాటు పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవగా చేస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆయన అన్నారు. కొవిడ్ బాధితులకు రెమిడెసివిర్ఇంజక్షన్లు, అక్సిజన్అందించడంలో, ఆస్పత్రుల్లో బెడ్లు సమకూర్చడంలోనూ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చిలకల […]