భోపాల్: ప్రభుత్వ ఉద్యోగుల వస్త్రధారణపై మధ్యప్రదేశ్ సర్కార్ ఆంక్షలు విధించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్ ధరించి ఉద్యోగానికి రావొద్దని ఉత్తర్వలు జారీచేసింది. జూలై 20న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించిన సమావేశానికి మాండ్‌సౌర్ జిల్లాలోని ఓ అధికారి పద్ధతిగా లేని దుస్తులు (టీ షర్టు) ధరించి హాజరయ్యాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరుకావాలని […]