సారథి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ట్రాఫిక్ ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో భద్రాచలంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్నవారికి జరిమానాలు విధించారు. వాహనదారులపై ఉన్న పెండింగ్ చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లించేలా పలు సూచనలు ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాన్ని నడిపేటప్పుడు అన్ని లైసెన్స్, ధ్రువీకరణపత్రాలను కలిగి ఉండాలని సూచించారు.