సామాజికసారథి, హైదరాబాద్: గురుకులాల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2022 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు 1,34,478 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. గత విద్యాసంవత్సరంలో 74,52 మంది మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో 48,120 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రవేశాలు లభిస్తాయి. ఒక్క సీటు కోసం సగటున ముగ్గురు విద్యార్థులు పోటీపడ్డారు. ప్రభుత్వం […]
సారథి, రామడుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలోకి ప్రవేశానికి నిర్వహించే వీటీజీ సెట్ ను ఈనెల 18న ఆదివారం నిర్వహించనున్నట్లు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు మీసేవ నుంచి గాని ఆన్‌లైన్ సర్వీస్ నుంచి గాని డౌన్లోడ్చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల […]