న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న కారణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. గురువారం విచారణ జరిగిన సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు చెప్పారు. జులై 1 నుంచి 15 వరకు జరగాల్సిన సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. వాటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలను కూడా క్యాన్సిల్ చేశామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీ, […]