Breaking News

SUBRAHMANYASWAMY

కుమారస్వామికి అభిషేకం

కుమారస్వామికి అభిషేకం

సారథి న్యూస్​, శ్రీశైలం(కర్నూలు): లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలు నిర్వహించారు. అభిషేకం, సుబ్రహ్మణ్య అష్టోత్తరం చేసిన అనంతరం సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణలు చేశారు. స్వామివారికి పంచామృతాలైన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలతో విశేష అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అర్చక స్వాములు భౌతిక దూరాన్ని పాటిస్తూ విశేషార్చనలు జరిపించారని ఈవో రామారావు తెలిపారు.

Read More