మాస్కో: నెలరోజుల క్రితం రష్యా విడుదల చేసిన కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనదేనని ప్రముఖ మెడికల్ జనరల్ లాన్సెట్ మ్యాగజైన్ లో ఒక కథనం ప్రచురితమైంది. ‘స్పుత్నిక్-వి’ పేరిట గతనెల 11న రష్యా దీనిని విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా, క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ వ్యాక్సిన్ ఇచ్చినవారిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని లాన్సెట్ తెలిపింది. జూన్-జులై లో ‘స్పుత్నిక్-వి’ తీసుకున్న 76 మందికి యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయని, వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్కనిపించలేదని వివరించింది. లాన్సెట్ […]