చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరుకు చెందిన ఓ స్వర్ణకారుడు వినూత్నంగా ఆలోచించి బంగారం, వెండితో మాస్కును తయారుచేశాడు. బంగారుమాస్కును 2.75 లక్షలకు, వెండి మాస్కును రూ.15,000 లకు విక్రయిస్తున్నట్టు ఆ స్వర్ణకారుడు తెలిపారు. ఇప్పటికే వీటికి 9 ఆర్డర్లు వచ్చాయని చెప్పారు. ధనవంతులు తమ హోదాకు చిహ్నంగా ఓ మాస్కులను కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు.
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా మహమ్మారి ధాటికి బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. మంగళవారంర 10 గ్రామాల బంగారం రూ.50,670కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో పుంజుకున్న ధరలు, దేశీయస్టాక్ మార్కెట్లలో అమ్మకాలు, దేశీయ కరెన్సీ రూపాయి బలహీనం నేపథ్యంలో పసిడికి డిమాండ్ పెరిగింది. కేజీ వెండి రూ.48,510 పలుకుతోంది. గ్రాము వెండి రూ.485.10 ఉంగా, 10 గ్రాముల వెండికి రూ.4,851 ఉంది.