సారథి న్యూస్, గోదావరిఖని: మలిదశ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ సాగించిన పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, టీబీజీ కేస్ ఆఫీసులోనూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకలజనులను ఏకం చేస్తూ 14 ఏళ్ల పాటు గులాబీ పార్టీ అనేక ఉద్యమాలు చేసిందన్నారు. అనంతరం విజయ ఫౌండేషన్ ద్వారా వికలాంగులకు నిత్యావసర […]
సారథి న్యూస్, రామడుగు: టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని శ్రీరాములపల్లిలో సహకార సంఘం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో సోమవారం వందమందికి మాస్క్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ వెంకటరమణరెడ్డి గ్రామాధ్యక్షుడు ఒంటెల అనిల్ కుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు భూత్కూరి సురేష్, జంగ నర్సింహరెడ్డి, మేడి వెంకటేశ్, సత్యనారాయణరెడ్డి, ఐలయ్య పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: టీఆర్ఎస్ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురష్కరించుకుని కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్ రావుపేట గ్రామంలో 63 మంది వలస కూలీలకు సోమవారం ఆ పార్టీ నాయకులు అన్నదానం చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ 2 ఎడవెల్లి కరుణశ్రీ, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు దాసరి బాబు, చాడ రామచంద్రాపూర్, మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, పూడూరి మల్లేశం, దాసరి అరుణ్ కుమార్, కొలిపాక మల్లేశం, రేండ్ల మల్లేశం, అలువాల […]
రంజాన్ మాసం ప్రారంభమవడంతో ఉపవాసదీక్షలో ఉండే కరోనా పాజిటివ్ రోగులకు ప్రత్యేక వంటకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెల్లవారుజామున దీక్షకు ముందే రొట్టెలు, పప్పుతో పాటు శాకాహార వంటకం అందిస్తారు. సాయంత్రం దీక్ష విరమించగానే ఇఫ్తార్ లో భాగంగా కిచిడి, బగారా రైస్, చికెన్ దాల్చా, వెజ్, నాన్వెజ్ బిర్యానీ అందించనున్నారు. రాత్రి ఎనిమిదిన్నర తర్వాత అరటి, ఖర్జూరాపండ్లు, పాలు, బ్రెడ్, టీ ఇవ్వనున్నారు.
లాక్ డౌన్ అమలు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం రూ.6,082 కోట్లు విడుదల చేసిందని కేంద్ర పెట్రోలియశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ప్రకటించిన రూ.1.7లక్షల ప్యాకేజీ నుంచి ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు.
గ్రామపంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి రూ.8500 వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీతాన్ని ప్రతినెల 1వ తేదీనే చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆఫీసు తాజాగా ఆదేశించింది. పంచాయతీలకు ప్రతినెలా విడుదలవుతున్న రూ.336 కోట్ల నుంచి వీటిని చెల్లించువకోవచ్చని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నిబంధనలు పాటించని పంచాయతీలపై తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది.