వైభవంగా శివనారాయణ స్వామి జాతర భక్తుల తాకిడితో కిటకిటలాడిన ఆలయం సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం గ్రామంలో బాలయోగి శివనారాయణ స్వామి జాతర ఉత్సవం కన్నులపండువగా సాగింది. రాష్ట్ర నలుమూలలతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. శివనామస్మరణతో ఆలయం కిటకిటలాడింది. స్వామివారి దర్శనంలో భక్తులు తరించిపోయారు. ప్రత్యేకపూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. 12 మంది దంపతులు లోకకల్యాణార్థం స్వామివారి కల్యాణం జరిపించారు. ఈ మహోత్సవానికి […]