గ్రామస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా.. సారథి న్యూస్, మెదక్: ఆమె పేరు అనిత.. పల్లెటూరులో సాధారణ గృహిణి. పేదరిక నిర్మూలన, మహిళా ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహిళా స్వయం సహాయక సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరింది. ‘నేను నాది‘ అని కాకుండా ’మనం మనది‘ అనే సమష్టి భావనతో సంఘంలో సభ్యులైన తోటి మహిళలకు స్త్రీనిధి పథకం ఉద్దేశం, లక్ష్యాలపై అవగాహన కల్పిస్తూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎదిగేలా చేసింది. గ్రామసంఘం లీడర్ […]