నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లి పీటలెక్కారు. ఈ తంతు అంతా వీరిద్దరూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేనండోయ్.. మరేది కాదు! ప్రముఖ సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే క్యూట్ లవ్ స్టోరీని రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాలోని స్టిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్న చైతూ, సాయిపల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. […]
నిఖిల్ ఇండస్ర్టీకొచ్చి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘హ్యాపీడేస్’తో ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ డిఫరెంట్ మూవీస్‌తో అలరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు 20వ సినిమాకు చేరువలో ఉన్నాడు. ఈ సినిమా అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సోనాలి నారంగ్ ప్రెజెంట్స్ శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ గ్రూప్స్ అధినేతలు నారాయణ్ దాస్, పుష్కర్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా […]
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ స్టోరీ’తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత ‘మనం’ ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో కలిసి పనిచేయనున్నాడట. అయితే ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయేనట. ఈ సినిమా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చైతుతో తీస్తున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాన్స్, కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్‌టైనర్’అని అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి […]