సారథి న్యూస్, వనపర్తి: రిజర్వేషన్ల పితామహుడు, సాంఘిక సంస్కర్త సాహు మహారాజ్ జయంతి వేడుకలను శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజావాగ్గేయకారుడు రాజా రామ్ ప్రకాష్, కవి పండితుడు గిరిరాజయ్య చారి, కవి గాయకుడు విభూది ఈశ్వర్, డప్పు నాగరాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగవుల వెంకటస్వామి, రెడ్డి సేవా సంఘం నాయకులు కృపాకర్ రెడ్డి, బాలస్వామి నాయుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ పాల్గొన్నారు.