సారథి న్యూస్, కడప: ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆర్‌జీయూకేటీ, ఆర్‌కే వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త ఎకడమిక్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రూ.10.10 కోట్ల అంచనాతో నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు […]