లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను కాల్చి చంపిన ఘటనలో ప్రధాన నిందితుడు వికాస్ దుబేపై పోలీసులు రివార్డు పెంచారు. ఇప్పటి వరకు రూ.50 వేలు ఉన్న రివార్డును 2.5లక్షలకు పెంచుతూ యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ సీ. అవస్థి ఆదేశాలు జారీచేశారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ప్రశాంత్ కుమార్ సోమవారం చెప్పారు. నిందితుడిపై ముందు రూ.50వేలు ఉన్న రివార్డును రూ.లక్షకు పెంచారు. ఆ తర్వాత ఇప్పుడు రూ.2.5లక్షలకు […]