కరోనా మహమ్మారి టీవీ, సినిమా ఇండస్ట్రీని వణికిస్తున్నది. తాజాగా బిగ్‌బాస్ ఫేం రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్నే స్వయంగా రవికృష్ణే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని చెప్పారు. తనతో కాంటాక్ట్ అయినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని రవి సూచించారు. […]