సామాజిక సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని శ్రావణ ఆదివారం సందర్భంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వేదోక్తంగా ఆశీర్వదించారు. ఆలయ వెంట పీఆర్వో చంద్రశేఖర్ లడ్డూప్రసాదం అందజేసి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు.