రాయ్‌పూర్ : త్రిపురలో యువతిపై అయిదుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన మరవకముందే మరో పైశాచిక సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసింది. బలోదబజార్ జిల్లాలో ఇద్దరు మైనర్ అక్కాచెల్లెల్లపై 11 మంది అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటూ బెదిరించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు వెలుగులోకి రావడం గమనార్హం. ఇద్దరు బాలికలపై గ్రామానికి చెందిన 8 మంది యువకులు, ముగ్గురు […]