న్యూఢిల్లీ: లాక్డౌన్ తర్వాత టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ప్రాక్టీస్‌లోకి దిగుతున్నారు. తాజాగా మిడిలార్డర్ బాట్స్మన్ చతేశ్వర్ పుజారా.. ఔట్ డోర్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన సొంత ఊరిలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. ‘మళ్లీ బ్యాట్ పట్టా. సుదీర్ఘంగా విరామం వచ్చినా.. స్టాన్స్ తీసుకుంటుంటే నిన్నటి రోజులాగానే అనిపిస్తోంది’ అని పుజారా వ్యాఖ్యానించాడు.