సారథి న్యూస్, కోడిమ్యాల: జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పోతారం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందిస్తామని సాక్ష్యాత్తు మంత్రులే వచ్చి హామీలిచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ పనులను ప్రారంభించలేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం కోడిమ్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోతారం రిజర్వాయర్ మత్తడి మూడు మీటర్లకు పెంచి ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఎంతసేపూ సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి నీళ్లను తీసుకెళ్లి తన సొంత వ్యవసాయ […]