సారథి, కొల్లాపూర్: కరోనా కష్టకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలను పీడిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మండిపడ్డారు. బుధవారం కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్లలో భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వినూత్నరీతిలో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు డి.శేఖర్ మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల సామాన్య ప్రజలపై భారం పడుతుందని, వెంటనే తగ్గించాలని […]