సారథి న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి సోమవారం పెన్సిల్ మొనపై అమరవీరుల స్థూపాన్ని చెక్కాడు. అమరవీరులను స్మరిస్తూ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని, ఇది ఆ అమరవీరులకు అంకితమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.