సారథి, కొల్లాపూర్(పెద్దకొత్తపల్లి ): నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్ పాముల గ్రామంలో పేకాట ఆడుతున్న 9మంది పేకాటరాయుళ్ల స్థావరాలపై దాడిచేసి అరెస్టు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. వారి నుంచి రూ.8,940 నగదు, అలాగే సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగన్న తెలిపారు. మున్ముందు గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కఠినమైన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.