శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రజౌరి జిల్లా సందర్‌బన్‌లో గురువారం అర్ధరాత్రి పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు అమరుడయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీ రాత్రి 10 :45 గంటలకు ఒక్కసారిగా కాల్పులకు దిగిందని అధికారులు చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ పూంచ్ జిల్లాల్లో కూడా కాల్పులు జరిపినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలోని కిర్నీ సెక్టార్‌లో మోర్టార్‌లతో దాడి చేశారని, మన ఆర్మీ వారిని సమర్థంగా తిప్పికొట్టిందని […]
లండన్: కరోనా దెబ్బకు కుదేలైన క్రికెట్‌ను మళ్లీ గాడిలో పెట్టేందుకు అన్నిదేశాల బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వైరస్ బారినపడకుండా ఆటలో కొన్ని మార్పులను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రతిపాదించింది. ఈ మేరకు ఐసీసీతో చర్చలు జరుపుతోంది. వెస్టిండీస్, పాకిస్థాన్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ ‘కరోనా సబ్ స్టిట్యూట్’ను ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం టెస్ట్‌ల్లో కంకూషన్ సబ్ స్టిట్యూట్ మాత్రమే ఉంది. ఇప్పుడు కరోనావ్యాప్తి నేపథ్యంలో ఎవరైనా ప్లేయర్ కు కొవిడ్ లక్షణాలు ఉంటే వాళ్ల స్థానంలో […]
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ తౌఫిక్ ఉమర్ కరోనా బారినపడ్డాడు. ఒంట్లో నలతగా ఉండడంతో శనివారం ఆస్పత్రికి వెళ్లిన అతను కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఇందులో పాజిటివ్‌గా రావడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి తనలో తీవ్రమైన లక్షణాలు లేని కారణంగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని ఉమర్ వెల్లడించాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నాడు. పాకిస్థాన్ తరఫున 44 టెస్ట్‌ల్లో 2,963 పరుగులు చేసిన 38 ఏళ్ల ఉమర్.. 12 వన్డేల్లో 504 పరుగులు సాధించాడు. […]
స్వతంత్ర కమిటీని నియమించిన పీసీబీ కరాచీ: తనపై విధించిన మూడేళ్ల నిషేధంపై పాక్ బ్యాట్స్ మెన్ఉమర్ అక్మల్ అప్పీల్‌కు వెళ్లాడు. దీంతో ఈ కేసును విచారించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వతంత్ర కమిటీని నియమించింది. విచారణ సందర్భంగా తన వాదనలను బలంగా వినిపించేందుకు బాబర్ అవాన్ కు చెందిన లా ఫర్మ్ ను అక్మల్ ఉపయోగించుకోనున్నాడు. అవాన్.. పాక్ ప్రధాని ఇమ్రాన్ కు పార్లమెంటరీ అఫైర్స్ సలహాదారుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ […]