సారథి న్యూస్, కర్నూలు: రెండు నెలల్లో కర్నూలు, ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభమవుతాయని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. సోమవారం ఆయన ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా ఎయిర్ పోర్ట్ ను అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారని వివరించారు. పెండింగ్ ఉన్న 17 రకాల పనులను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని సూచించారు. […]