సారథి న్యూస్, మానవపాడు: సీపీఎస్ విధానం ద్వారా 1.5లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ చేతులమీదుగా టీఎస్సీపీఎస్ ఈయూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 14న జిల్లా కేంద్రంలో భారీర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి ఉద్యోగులను కాపాడాలని రాష్ట్ర సలహాదారుడు విష్ణు కోరారు. […]