Breaking News

NARAYANAPET

నాటుపడవ బోల్తా.. నలుగురు గల్లంతు

నాటుపడవ బోల్తా.. నలుగురు గల్లంతు

మక్తల్​: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల గ్రామం సోమవారం కృష్ణానదిలో నాటుపడవ మునిగి ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి గల్లంతయ్యారు. వీరిని కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. నిత్యావసర సరుకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న నాటుపడవ మునిగింది. అందులో ఉన్న 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైనవారిని సుమలత, రోజా, చిన్నక్క, నర్సమ్మగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నారాయణపేట జిల్లా ఎస్పీ […]

Read More

అదనపు గదులు ప్రారంభం

సారథి న్యూస్​, నారాయణపేట: నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత గ్రామంలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రులు ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More

అరక పట్టి.. సాలు కొట్టి

సారథి న్యూస్​, నారాయణపేట: మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ రైతన్నలా మారారు. అరక పట్టి పొలం దున్నారు. కొద్దిసేపు రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నిడ్జింత జడ్పీ హైస్కూలులో నూతనంగా నిర్మించిన అదనపు గదులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో పొలంలో విత్తనాలు వేస్తున్న రైతులను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. విత్తనాలు అందుతున్నాయా.. లేదా.. అని అడిగి ఆరా తీశారు. మంత్రి తమతో […]

Read More

లాభం వచ్చే పంటలే వేయండి

సారథి న్యూస్​, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనగార్డెన్స్ లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట నియోజకవర్గ స్థాయి వానాకాలం వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, నూతన వ్యవసాయ విధానంపై గురువారం రైతులు, అధికారులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ముఖ్య​అతిథులుగా హాజరైన మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. లాభం వచ్చే పంటలను మాత్రమే వేయాలని రైతులను కోరారు. ఎప్పటికప్పుడు అగ్రికల్చర్​ అధికారుల సూచనలు పాటించాలని […]

Read More
వలస కూలీలకు చేయూత

వలస కూలీలకు చేయూత

సారథి న్యూస్, నారాయణపేట: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను వాటి యజమానులు ఆదుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం, గొల్లపల్లిలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కూలీలను మంగళవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలతో పాటు వలసొచ్చిన కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు, నగదును ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మానవతా […]

Read More