Breaking News

NAGPUR

కిక్కు కోసం శానిటైజర్​ తాగి..

నాగ్‌పూర్‌: మద్యం దొరకలేదని శానిటైజర్​ తాగిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని నాగ్​పూర్​కు చెందిన గౌతమ్​ గోస్వామి (45) స్థానిక మున్సిపాలిటీలో క్లీనింగ్​ వర్కర్​గా పనిచేస్తున్నాడు. మద్యం దొరకపోవడంతో శానిటైజర్​ తాగితే కిక్కు వస్తుందని భావించిన గోస్వామి తన ఇంట్లో ఉన్న శానిటైజర్​ను తాగాడు. దీంతో అతడు అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యలు చికిత్సచేసి పంపించారు. రెండ్రోజుల అనంతరం ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడు.

Read More

షూస్​ లేక మ్యాచ్​ ఆడలే

న్యూఢిల్లీ: చిన్నతనంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొవడంతో.. తన కెరీర్ ఆలస్యంగా మొదలైందని టీమిండియా స్టార్ పేసర్ ఉమేశ్ యాదవ్ అన్నాడు. కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు పడ్డానన్నాడు. స్పైక్ షూస్ లేవనే కారణంతో ఓ కోచ్ మ్యాచ్ ఆడనివ్వలేదని గుర్తుచేసుకున్నాడు. ‘నా కెరీర్ చాలా ఆలస్యంగా మొదలైంది. కార్క్ బాల్​తో క్రికెట్ ఆడతారని టీవీల్లో మాత్రమే చూశా. దానిని పట్టుకోవడానికి చాలా సమయం పట్టింది. బయట క్రికెట్​ లో నేను యార్కర్లు అద్భుతంగా వేస్తుండడాన్ని ఒకాయన గమనించాడు. […]

Read More