Breaking News

NADISWARASWAMY

నందీశ్వర స్వామికి విశేషపూజలు

నందీశ్వర స్వామికి విశేష పూజలు

సారథి న్యూస్​, శ్రీశైలం(కర్నూలు): లోక కల్యాణం కోసం దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలో నందీశ్వరస్వామివారికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిపించింది. నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు, , ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, ల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నందీశ్వరస్వామి వారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలు చేశారు. తర్వాత నానబెట్టిన శనగలు నందీశ్వర స్వామికి సమర్పించారు.

Read More