ముంబై: కరోనా నేపథ్యంలో మాస్కులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో కొందరు అక్రమార్కులు ఎన్95 మాస్కులంటూ నకిలీవి తయారు చేసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా అటువంటి నకిలీ మాస్కుల రాకెట్‌ను ముంబై పోలీసులు ఛేదించారు. రూ.21.39 లక్షల మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని భీవాండికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి భారీ ఎత్తున నకీలీ మాస్కులను తీసుకొచ్చాడు. అనంతరం వాటిని ముంబై, థానేలోని పలు మెడికల్ షాపుల్లో విక్రయించాడు. పోలీసులకు ఫిర్యాదుల అందడంలో […]