సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో ఉన్న ఆశ్రమానికి వెళ్లి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు త్రిదండి చిన్నజీయర్ స్వామిని పరామర్శించారు. చిన్నజీయర్‌స్వామి తల్లి అలివేలు మంగతాయారు(85) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. ఈ నేపథ్యంలో స్వామివారిని సీఎం కేసీఆర్ పలకరించి వచ్చారు.