సారథి, ఎల్బీ నగర్: కాలనీల్లో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని ఎంఆర్‌డీసీ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట, షిర్డీసాయినగర్ కాలనీల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. అనంతరం కాలనీలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నల్ లైన్స్, మిగతా డ్రైనేజీ పనులకు ప్రతిపాదనల ప్రకారం నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. సీసీరోడ్లు, ఇతర సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. […]