సారథి న్యూస్, మహబూబ్ నగర్: కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు యథాతధంగా కొనసాగుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామి వారి అలంకరణ మహోత్సవం, ఉద్దాల మహోత్సవం ఆనవాయితీ ప్రకారం జరిపిస్తామని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జాతర ప్రాంగణంలో ఎలాంటి గుడారాలు కానీ, స్వీట్ షాపులు, మటన్ దుకాణాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు.