సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని ఎంఆర్ఎఫ్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా మన్సురాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సరస్వతీనగర్ నుంచి లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తూ పెద్దచెరువు మీదుగా అమ్మదయ కాలనీ, బాలాజీ నగర్, శుభోదయ నగర్, చిత్రసీమ కాలనీ, జడ్జస్ కాలనీ, జడ్జస్ కాలనీ ఫేస్–1 మీదుగా ఆటోనగర్ డంపింగ్ యార్డ్ వద్దకు […]