సారథి న్యూస్, తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న వరిధాన్యం పారా బాయిల్డ్ మిల్లులుకే పరిమితం కాకుండా అన్ని మిల్లులకు అప్పగించాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట కల్వకుర్తి వైస్ ఎంపీపీ కొండూరు గోవర్ధన్ తదితరులు ఉన్నారు.