సారథి, హైదరాబాద్: వరద నీటితో ఎలాంటి ఇబ్బందులు పడకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ పనులు చేపడుతున్నామని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్‌డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎల్‌బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హయత్ నగర్ డివిజన్ లోని ఆంధ్రకేసరి నగర్ రోడ్డు నం.1లో రూ.75 లక్షలతో, బీజేఆర్ కాలనీ నుంచి జీహెచ్ఎంసీ లిమిట్స్ వరకు రూ.58.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న వరద నీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]