న్యూఢిల్లీ: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) భారత వైమానిక దళానికి మరో శక్తివంతమైన మిస్సైల్ ను అందించనుంది. ఈ మిస్సైల్ ఎయిర్ టు ఎయిర్.. అంటే గాలిలోనే తన కమాండ్స్ మార్చుకునేలా, గాలిలోనే శత్రుదేశాల విమానాలను ధ్వంసం చేసే సామర్థ్యంతో దీన్ని రూపొందిస్తున్నారు. మరెంతో విశిష్టమైన టెక్నాలజీపరమైన ప్రత్యేకతలు దీని సొంతమని తెలుస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే భారత వైమానిక దళం శక్తిసామర్థ్యాలు మరింత పెరుగుతాయని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.