సారథి న్యూస్, నాగర్కర్నూల్: కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, సంబంధిత అధికారులు అలసత్వం, పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన వనపర్తి కలెక్టరేట్ నుంచి మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగుళాంబ గద్వాల, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, అగ్రికల్చర్, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని తప్పనిసరిగా కొనాలని సూచించారు. […]