సారథి న్యూస్, కరీంనగర్: మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చిరుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో మిడ్ మానేరు లింక్ కెనాల్ కు మంత్రి ఈటల రాజేందర్ సోమవారం భూమిపూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్, ఇరిగేషన్ శాఖ, ఇతర శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.